Virat Kohli: వారం రోజుల కిందట పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ముల్హానాపూర్ లో జరిగిన మ్యాచులో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం అందరూ ప్లేయర్లు, ఓనర్ల లాగే గ్రౌండ్ లో విరాట్ కొహ్లీ, ప్రీతి జింటా తెగ ముచ్చటించారు. సరదగా నవ్వుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు.
కానీ వారే ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో ఓ నెటిజన్ ఎక్స్ ట్విటర్ లో ప్రీతి జింటాను ట్యాగ్ చేస్తూ ఫ్లీజ్ ఎం మాట్లాడుకున్నారో చాట్ చేసి చెప్పండి అంటూ అడిగారు..
స్పందించిన ప్రీతి జింటా..
ప్రీతి జింటా స్పందిస్తూ.. అవును మేం చాలా సేపు మాట్లాడుకున్నాం. కానీ అది ఆట గురించి కాదు.. మా వ్యక్తిగత జీవితాల గురించి అని చెప్పింది. విరాట్ కొహ్లీ పిల్లలు ఏం చేస్తున్నారని, ఎలా ఉన్నారని అడిగితే ఫోన్ లో చూపించాడు. అప్పుడు చాలా ఆనందం వేసింది. అలాగే మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఫోన్లలో చూపించాను.. అలా సరదగా నవ్వుకున్నాం. విరాట్ నాకు 18 సంవత్సరాల నుంచి తెలుసు.. అప్పుడు ఎంత యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండేవాడో.. ప్రస్తుతం అదే స్పీడ్, అదే ఎనర్జిటిక్ గా ఉంటున్నాడు. ఇలా ఉండటం ఒక్క విరాట్ కే సాధ్యమనేలా నిరూపించాడు. ఇప్పటికీ అదే ఫైర్ చూపిస్తున్నాడు. ఎంతో మందికి ఐకానిక్ గా నిలుస్తున్నాడు అని విరాట్ ను ప్రశంసలతో ముంచెత్తింది.
విరాట కొహ్లీ, అనుష్క దంపతులకు ముందు పాప జన్మించగా.. ఆ తర్వాత బాబు పుట్టాడు. విరాట్ కొహ్లీకి పిల్లల పేస్ ను కెమెరాకు చూపించడం అస్సలు ఇష్టం లేదు. కెమెరాల్లో ఫొటోలు తీయకూడదని ఇంతకుముందే అందరికీ బహిరంగంగా రిక్వెస్ట్ చేశాడు. గతంలో ఆస్ట్రేలియా టూర్ లో కూడా ఇలా పిల్లల వీడియోలు తీస్తున్న ఫొటోగ్రాపర్లపై మండిపడ్డాడు. విరాట్ కూతురు పేరు వామికా కాగా… కొడుకుకు అకాయ్ అని నామకరణం చేశాడు.