Wednesday, 12 March 2025, 20:33
Police
Police

Police: మహిళా పోలీసులకు సన్మానం

Police: జుక్కల్, మర్చి 08 (ప్రజా శంఖారావం): ఆడపిల్ల అంటే.. ‘ఆడే’ ఉండిపోవాలా..? కట్టుబాట్ల బందిఖానాలో బందీ అయిపోవాలా..? ఎవరన్నారు, సృష్టికి మూలం, అవనిలో సగం.. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఇలా ‘ఆమె’ కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఎస్సై మాట్లాడుతూ మహిళలు విద్య, వైద్య, క్రీడా రంగాలలో రాణించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ ఈరంగం ఆ రంగం అన్న తేడా లేదు. పురుషులు చేసే ప్రతి పనినీ సమర్థవంతంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ అని కొనియాడారు. ‘సమానత్వమన్న’ పదానికి అర్థం చెబుతోంది. తన శక్తి అపరిమితం.. తన సహనం, తెగువ అనితర సాధ్యమన్నారు. మధ్యమధ్యలో ఎక్కడో రాబందులు.. తన ఉనికికి అడొస్తున్నా, తన భవితను చిదిమేస్తున్నా.. వెరవక,
వెనకడుగు వేయక.. ధైర్యంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. నేటి మన ధైర్య లక్ష్మి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వనితల విజయగాథలు, వివిధ రంగాల పురోగతిలోవెన్నెముఖగా నిలుస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *