Todays Horoscope: ఆర్థికంగా ఈ రాశుల వారు అదృష్టవంతులు.. నేడు 12 రాశుల దిన ఫలాలు..
ఏప్రిల్ 25, 2025 శుక్రవారం మేష రాశి వారికి కొద్దిగా సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో డిమాండ్ పెరుగుతుంది. ఈరోజు 12 రాశుల దిన ఫలాలు ఇవే.
మేషరాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంది. బాధ్యతలు పెరిగినా కూడా ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ రాశి:
ఉద్యోగంలో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెళ్లి ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆర్థికంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. స్నేహితులతో కలిసి సమాజసేవలో పాల్గొంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మిధున రాశి:
వృత్తి మరియు ఉద్యోగం అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. చేతికి రావలసిన డబ్బు వస్తుంది.
కర్కాటక రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. మీ మాటకు అధికారులు విలువ ఇస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య తీరుతుంది. వ్యాపారం లేని లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది మంచి అవకాశం.
సింహరాశి:
కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థిక పనులు చెక్కబడతాయి. ఖర్చులను తగ్గించుకోవాలి. ఆదాయం పెరుగుతుంది. మీ పనితీరుతో వృత్తి మరియు ఉద్యోగంలో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం కొంచెం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కన్య రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ వ్యవహారాలకు అనుకూల సమయం. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఊహించిన స్థాయిలో లాభాలు పొందుతారు. పెళ్లి ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
తులారాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. సమయం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు కోరికలు తీరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం.
వృశ్చిక రాశి:
ఉద్యోగంలో సహద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు ఉంటాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. డాక్టర్లు మరియు లాయర్లకు తీరిక ఉండదు. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బులు చేతికి వస్తాయి.
ధనస్సు రాశి:
ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. పదోన్నతి పెరుగుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. ముఖ్యమైన పనులలో ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంది. మీకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొద్దిపాటి శ్రమించి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మరియు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం.
కుంభరాశి:
ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం బిజీగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. కుటుంబంలో అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. పెళ్లి ప్రయత్నాలలో మంచి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది.
మీన రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. మీ మాటకు విలువ ఉంటుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో ఊహించిన శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.