Todays Horoscope: వీళ్లు పట్టిందల్లా బంగారం.. 12 రాశుల దిన ఫలాలు ఇవే..

Todays Horoscope
Todays Horoscope

Todays Horoscope: వీళ్లు పట్టిందల్లా బంగారం.. 12 రాశుల దిన ఫలాలు ఇవే…

నేడు ఏప్రిల్ 7, 2025 నాటి 12 రాశుల రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయంలో లోటు ఉండదు కానీ ఆర్థిక వ్యవహారాలలో వాగ్దానాలు చేయడం వంటివి చేయకూడదు. మేషరాశి నుండి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు …

మేషరాశి:

అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వృత్తి మరియు ఉద్యోగం సాఫీగా సాగుతుంది. సామాజికంగా గౌరవాభిమానాలు తిరిగి అవకాశం. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం. ఆర్థిక వ్యవహారాలలో ఎవరిని కూడా నమ్మకూడదు.

వృషభ రాశి:

వీళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో నష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ ఆర్థిక విషయాలలో ఎవరికి హామీలు చేయకూడదు.

మిథున రాశి:

వీళ్లకు అనేక విషయాలలో సమయం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. అంచనాలకు మించి వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది సరైన సమయం.

కర్కాటక రాశి:

ఉద్యోగ పరంగా మంచి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి మరియు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. అధికారుల నుంచి నమ్మకం పొందుతారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. గృహ వాహన ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్వల్ప అనారోగ్య సూచనలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహరాశి:

ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి ఉండదు. వృత్తి మరియు వ్యాపారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. తల్లిదండ్రులలో ఒక ఆరోగ్యం కొంచెం ఆందోళన కలిగిస్తుంది. తోబుట్టువులతో ఉన్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది.

కన్యరాశి:

అనుకున్న పనులు పూర్తవుతాయి. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

తులారాశి:

ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఉద్యోగం మరియు పెళ్లి ప్రయోజనాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి మరియు వ్యాపారం మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి:

ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

ధనస్సు రాశి:

ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు స్పెక్యులేషన్లో వంటి వల్ల మంచి లాభాలు వస్తాయి. రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి. వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఊహించిన దాని కంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.

మకర రాశి:

ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి.

కుంభరాశి:

అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి మరియు ఉద్యోగం ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనరాశి:

ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యక్తులకు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట బయట మీ మాటకు విలువ ఇస్తారు. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now