Todays Gold Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు తులం ధర ఎంతంటే..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు తులం ధర ఎంతంటే..

గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు మళ్ళీ నిన్నటి నుంచి పెరుగుతూ రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. మొన్నటి వరకు రూ.89 వేలు ఉన్న తులం బంగారం ధర నిన్న ఏకంగా రూ.3 వేలు పెరిగి రూ.93 వేలకు నమోదయింది. ఈరోజు కూడా పసిడి ధరలు ఆ రేంజ్ లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ.93,390 గా ఉన్నట్లు సమాచారం.

అంతర్జాతీయ మార్కెట్లు మరియు బులియన్ మార్కెట్లో మనదేశంలో పసిడి ధరలపై చాలా ప్రభావం చూపిస్తాయి. పసిడి మరియు వెండి ధరలపై అమెరికా డాలర్ మరియు రూపాయి మారక విలువ కూడా భావం చూపిస్తాయి. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా పసిడి ధరలను నిర్ణయిస్తాయి అని చెప్పొచ్చు. ఈ క్రమంలో బంగారం ధరలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు పసిడి మరియు వెండి ధరలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. లేటెస్ట్ గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పసిడి ఆభరణాల దిగుమతులపై సుంకాలను విధించడంతో పసిడి పరుగులకు బ్రేక్ పడింది. కానీ అది కూడా ఇప్పుడు రివర్స్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో నుంచే బంగారం ధర 17 సార్లు ఆల్ టైం రికార్డుకు చేరుకుంది.కొందరిని పునులు మాత్రం పసిడి ధర 56వేలకు దిగివస్తుంది అని చెప్తుండగా మరి కొంతమంది నిపుణులు లక్ష మార్క్ దాటే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రోజున దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు…

హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 85,610 ఉంది.

విజయవాడ నగరం, విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 85,610 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,540 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,760 గా ఉంది.

ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.85,610 గా.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,390 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,610 గా నమోదయింది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 85,610 గా ఉంది.

పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. ఈరోజు వెండి కూడా భారీగానే పెరిగింది. బులియన్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.97,100 గా నమోదు. మరికొన్ని ప్రాంతాలలో వెండి ధర లక్షకు పైగానే ఉంది. ఈ పసిడి ధరలు మరియు వెండి ధరలు ఈరోజు ఉదయం 6:00 వరకు నమోదైనవిగా గుర్తించగలరు. ఇక రోజు మొత్తంలో పసిడి మరియు వెండి ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా అదే ధర దగ్గర స్థిరంగా కొనసాగవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now