Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధర ఈరోజు మళ్లీ తగ్గింది. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక ఉద్రిక్తలత పసిడి ధరలో ఆకాశాన్ని అంటుకున్నాయి. అమెరికా మరియు చైనా దేశాల మధ్య సుంకాల పోరు ప్రతిరోజు తీవ్రమవుతున్న క్రమంలో బంగారంపై మళ్లీ పెట్టుబడులు మండుతున్నాయి.
ఈ క్రమంలో మళ్లీ పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. నిజానికి బులియన్ మార్కెట్లో పసిడి కి మరియు వెండి కి ఎప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి పెరుగుతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛమైన గోల్డ్ ధర రికార్డు స్థాయిలో 96 వేల మార్క్ ను చేరుకోవడం జరిగింది.
తాజాగా ఈరోజు పసిడి మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 14 ఏప్రిల్, 2025 సోమవారం ఉదయం ఆరు గంటల వరకు చాలా వెబ్సైట్లో ఉన్న ధరల ప్రకారం 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,690 అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.95,660 గా ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర రూ.99,900 గా ఉంది. అయితే తులం పసిడి పై పది రూపాయలు అలాగే కిలో వెండి పై ₹100 తగ్గినట్లు తెలుస్తుంది.
మన దేశంలోని పలు ప్రధాన ప్రాంతాలలో ఈరోజు పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,690, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,660 గా ఉన్నాయి.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,690, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,660 గా ఉన్నాయి.
ఢిల్లీ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,840, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,810 గా ఉన్నాయి.
ముంబైలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,690, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,660 గా ఉన్నాయి.
చెన్నై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.87,690, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,660 గా ఉన్నాయి.
ఇక బెంగళూరు నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,690 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,660 గా ఉన్నాయి.
ఇక వెండి ధరలు పలు ప్రాంతాలలో ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,09,290 గా ఉంది.
ఈరోజు విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.
ఢిల్లీ నగరంలో ఈరోజు కిలో వెండి ధర రు.99,900 గా ఉంది.
ముంబై నగరంలో ఈరోజు కిలో వెండి ధర రు.99,900 గా ఉంది.
బెంగళూరు నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.99,900 గా ఉంది.
చెన్నై నగరంలో ఈరోజు కిలో వెండి ధర రు.1,09,900 గా ఉంది.
అయితే ఈ ధరలు ఈరోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవి గా గుర్తించగలరు.