Bank Account: రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలో కలిగి ఉన్నవాళ్లు వెంటనే ఈ పని చేయాలి. అలాంటివారు వెంటనే ఆర్బిఐ మార్పులను పాటించడం చాలా ముఖ్యం. రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు ఈ విషయాలను తెలుసుకోవాలి. వీటిపై నిపుణుల సూచనలను పాటించడం చాలా ముఖ్యమని తెలుస్తుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త మార్పులను చేపట్టింది. ఈ విషయాల గురించి మీరు తెలుసుకోకపోతే అనవసరమైన పెనాల్టీలు లేదా ఎకౌంటు బ్లాకింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలు రాకుండా నివారించడానికి వెంటనే మీ బ్యాగు ఖాతాలను పర్యవేక్షించడం చాలా అవసరం.
అయితే ప్రతి బ్యాంకు ఖాతాకు కనీస బ్యాలెన్స్ నిర్ధారించడం అనివార్యం అన్న విషయం తెలిసిందే. వీటిని గనుక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే బ్యాంకుల ఖాతాలో ఫీజులు లేదా సర్వీసు చార్జీలను పన్ను చేసే అవకాశం ఉంటుంది. మీరు వేర్వేరు బ్యాంకు ఖాతాలో ఉన్న అకౌంట్ బ్యాలెన్స్లను సరిగ్గా తనిఖీ చేయడం అత్యంత అవసరం. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు లేదా ఇతర బ్యాంకులలో ఎకౌంటు ఉన్నట్లయితే బ్యాలెన్స్లను తరచుగా సమీక్షించాలి. ప్రస్తుతం సాధారణంగా భారతదేశంలో చాలా మంది వ్యక్తులకు ఒకటి కంటే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
అయితే వాడకంలో ఉన్న కొన్ని ఖాతాలలో లావాదేవీలు చేయడం మానేస్తున్నారు. అయితే లావాదేవీలు జరగకుండా ఉన్న ఖాతాలు పనిచేయకుండా మారితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి ఖాతాలకు బ్యాంకులు సర్వీస్ ఫీజులు, ఎస్ఎంఎస్ చార్జీలు, అలాగే ఇతర ఖర్చులను విధిస్తాయి. అలా చేయడం వలన ఖాతాలో ఉన్న కనీస బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఇటువంటి సమయంలో మీ ఖాతా బ్యాలెన్స్ తప్పనిసరిగా పరిగణించాలి. మీ బ్యాంకు ఖాతా లో లావాదేవీలు చేయకపోతే బ్యాంకు అ ఖాతాలను బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ బ్యాంకు ఖాతా నుంచి కొంత మొత్తంలో లావాదేవీలు చేయడం వలన లేదా బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను నిర్ధారించడం వలన ఈ సమస్యను నివారించవచ్చు