Bank Account: ఈ బ్యాంక్ తమ కస్టమర్లకు వెంటనే కేవైసీ అప్డేట్ చేయాలని సూచించింది. అయితే డిసెంబర్ 31, 2024 నాటికి కేవైసీ అప్డేట్ చేయాలి కస్టమర్లు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ బ్యాంకులో ఖాతా ఉన్న వారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అలర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు ఒక కీలకమైన అలర్ట్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు ఈ మేరకు హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ బ్యాంకులో కేవైసీ అప్డేట్ చేయాలి కస్టమర్లు అకౌంట్ విషయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు.
అయితే ఈ ప్రకటన కేవలం డిసెంబర్ 31, 2024 నాటికి కేవైసీ అప్డేట్ చేయని కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలుస్తుంది. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో కేవైసీ అప్డేట్ అయ్యి ఉంటే మీరు మరోసారి చేయాల్సిన అవసరం లేదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం డిజిటల్ కేవైసీ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి కస్టమర్ యొక్క లైవ్ ఫోటో తీసుకోవడం మరియు అధికారిక ఇది ఫోటోను క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియను మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల సహాయంతో కూడా పూర్తి చేయవచ్చు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
మీకు సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి కేవైసీ ప్రాసెస్ అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇంటి దగ్గర నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ONE యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఎకౌంటు ఏ బ్రాంచ్ లో ఉందో ఆ బ్రాంచ్ కి డాక్యుమెంట్లు పోస్ట్ చేయడం ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్లో ఎటువంటి సమస్యలు రాకూడదని అనుకుంటే మార్చి 26, 2025 లోపు కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోండి.