Money deadlines: ప్రతి ఒక్కరికి ఆర్థిక క్రమశిక్షణ చాలా కీలకము. డబ్బులకు సంబంధించిన అన్ని వ్యవహారాలను సమయానికి నిర్వహించలేకపోతే చాలా నష్టపోతారు. మీరు ఒకరికి డబ్బులు ఇవ్వాలన్నా లేదా వసూలు చేయాలన్న ఈ పద్ధతినే ఫాలో అవ్వాలి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ముగుస్తుంది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ఏవైనా పెండింగ్ పనులు ఉంటే ఈ నెలలోనే పూర్తి చేయాలి. ముఖ్యంగా ఆదాయపు రిటర్న్స్ మరియు యూఏఎన్ యాక్టివేషన్ తదితర వాటికి ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉంటుంది.
పాత పన్ను విధానాన్ని బట్టి ఆదాయపు పన్ను చెల్లించేవారు సెక్షన్ 80సి, 80 డి, 80 జి కింద పన్ను ఆదా చేసుకోవడానికి ఈ నెల అంటే మార్చి 31వ తేదీ లోపల పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే జాతీయ పెన్షన్ వ్యవస్థ, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, తను ఆదా చేసే ఫిక్స్ డిపాజిట్లు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీముల ద్వారా తగ్గింపులు కూడా పొందవచ్చు. మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరగొచ్చు. వాటిని సరిదిద్ది ఐ టి ఆర్ యు ను అందజేస్తుంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
అది దాఖలు చేయడానికి సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగింపు నుంచి రెండు సంవత్సరాల సమయం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చి 31 లోపు ఐ టి ఆర్ యు ను అందజేయాలి. ఎవరికైనా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కాదా ఉంటే వాళ్లు తమ యూనివర్సల్ ఎకౌంట్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ఆన్లైన్లో ఖాతాను నిర్వహించుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. ఇందులోని సభ్యులకు ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా 7 లక్షల వరకు బీమా కవరేజ్ అందుతుంది. ఈ ప్రయోజనాలు మీరు పొందాలంటే మార్చి 15 లోపు యుఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేయాలి.