New Ration Card: చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కొంతమంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై కూడా చేసుకున్నారు. అయితే ఈ చిన్న పొరపాటు చేయడం వలన మీకు రేషన్ కార్డు రాకపోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం చాలామంది ఎదురుచూస్తుంది కొత్త రేషన్ కార్డు కోసం. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వలేదు. ఈ క్రమంలో లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయాలి అనుకుంటే ఈ విషయం గురించి తప్పకుండా తెలుసుకోండి. అయితే కొత్త రేషన్ కార్డు కావాలంటే పాత రేషన్ కార్డులో మీ పేరు తప్పకుండా తొలగించుకోవాల్సి ఉంటుంది.
ఇది అందరికీ వర్తించదు అని తెలుస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వచ్చిన మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పెళ్లికి ముందు పాత రేషన్ కార్డులో మహిళల పేరు ఉంటుంది. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ముందుగా పాత రేషన్ కార్డులో ఉన్న పేరును తొలగించి ఆ తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొత్త రేషన్ కార్డు వాళ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం కొత్త రేషన్ కార్డు రాదు అని తెలుస్తుంది. పాత రేషన్ కార్డులో పేరు తొలగించుకోవాలంటే ముందుగా తహసిల్దార్ కు అర్జీ పెట్టుకోవాలి. పెళ్లి అయిన వాళ్ళు తమకు పెళ్లి అయ్యిందని అత్తగారింటికి వచ్చామని పాత రేషన్ కార్డులో తమ పేరును తొలగించమని ఒక వినతి పత్రం రాసి తహసిల్దారుకు అందించాలి. ఈ పత్రంతోపాటుగా మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా పెళ్లి పత్రికను పాత రేషన్ కార్డు జిరాక్స్ తో పాటు జత చేసి ఇవ్వాలి అని వరంగల్ పౌరా సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు.