Akshaya Tritiya 2025: హిందూ మత ధర్మంలో అక్షయ తృతీయ కు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే పొరపాటున కూడా అక్షయ తృతీయకు ముందు కొన్ని రకాల వస్తువులను కొనకూడదు. ఒకవేళ అక్షయ తృతీయకు ముందు కొన్ని వస్తువులను కొంటె చాలా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడో రోజున అక్షయ తృతీయ పండుగను అందరూ జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30, బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహించడం వలన ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయని అందరి నమ్మకం.
లక్ష్మీదేవికి ఈరోజు పూజలు చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులతో తమ ఆదాయం వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ఇటువంటి అక్షయ తృతీయ కు ముందుగానే లేదా అక్షయ తృతీయ రోజున కానీ కొన్ని రకాల వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు. స్టీల్ అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ వస్తువులు, నల్లని దుస్తులు, పదునైన వస్తువులు, ఇనుప వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు. అక్షయ తృతీయ రోజున వీటిని కొనడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశిస్తాయి. వాస్తు దోషాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకూడదు. అక్షయ తృతీయ రోజున సూర్యోదయం తర్వాత స్నానం ఆచరించాలి. పొరపాటున కూడా ఆ తర్వాత నిద్రపోకూడదు. ఈ పవిత్రమైన రోజును దైవిక రోజుగా అందరూ భావిస్తారు. మహావిష్ణువు పరశురాముడు, హయగ్రీవుడు ఈ రోజున జన్మించారు కాబట్టి సాత్విక ఆహారాన్ని సేకరించాలి. ఈ రోజున వివాదాలు అలాగే వాదనలకు కూడా దూరంగా ఉండాలి. మానసికంగా శారీరకంగా ఎవరికీ బాధను కూడా కలిగించకూడదు. మూగజీవాలకు, పేదలకు ఆహారం పెట్టడం చాలా మంచిది.