Money: ప్రభుత్వం మహిళలకు ఒక గుడ్ న్యూస్ను తెలిపింది. మహిళలకు ఇది పోరాట కలిగించే వార్త అని తెలుస్తుంది. రానున్న రోజుల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు మరియు ఆలస్యం లేకుండా నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఇంతకీ ఏ డబ్బులు, ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుస్తుంది. వాళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు పలు రకాల పథకాలు కూడా అమలులోకి తెచ్చింది. మహిళల స్వయం ఉపాధి కోసం డ్వాక్రా సంఘాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చాలామంది మహిళలకు దీంతో ఊరట కలుగుతుంది. అయితే వీరికి మరింత మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం మహిళలకు అందించే సంక్షేమ పథకాల డబ్బులు మరియు ఇతర రాయితీలను నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభించింది. దీనికోసం మహిళా సంఘాల వివరాలను లోకోస్ యాప్ లో నమోదు కూడా చేస్తుంది. ఇలా చేయడం వలన ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు లేదా డబ్బులు నేరుగా మహిళా సంఘాల్లోని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. ఈ క్రమంలో ఎలాంటి ఆలస్యం మరియు అడ్డంకులు కూడా ఉండవు. చాలామంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులను కొన్ని రాష్ట్రాలు తామే ఇస్తున్నట్లు కూడా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులను ఇతర అవసరాలకు ఉపయోగించుకొని లబ్ధిదారులకు మాత్రం ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు లేకుండా చేయడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నల్గొండ అధికారులు లోగోస్ యాప్ లో మహిళా సంఘాలకు సంబంధించి పూర్తి వివరాలను ఎంటర్ చేస్తారని తెలిపారు. ఆ సంఘం పొదుపు వివరాలు, గ్రూప్ ఎప్పుడు ఏర్పాటయింది అన్ని వివరాలు కూడా ఆ యాప్ లో కరెక్ట్ గా నమోదు చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా మహిళా సంఘాల వివరాలు ఉంటాయి.