Govt Scheme: ప్రభుత్వం తాజాగా మహిళలకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది. 15 ఏళ్లు నిండిన వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే అవకాశం. మహిళా సాధికారత కోసం కృషి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళల అకౌంట్స్ లో డబ్బులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళల సాధికారతకు ప్రభుత్వం డ్వాక్రా బూస్ట్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక రకాల పథకాలు తీసుకుని వచ్చింది. ఇలాంటి పథకాలలో డ్వాక్రా పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలు తమ సొంత వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకులో నుంచి రుణాలు పొందుతున్నారు. ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు బ్యాంకుల ద్వారా రుణం అందుతుంది.
అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాము ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు మంజూరు చేస్తున్నారు. ఆ వచ్చిన రుణం డబ్బుతో మహిళలు స్వయం ఉపాధి పెట్టుకుంటున్నారు. మహిళలు వ్యవసాయం, వ్యాపారం మరియు చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ రుణాలు బాగా ఉపయోగపడుతున్నాయి. డ్వాక్రా గ్రూపు మహిళలకు ఉచిత భీమా కూడా లభిస్తుంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
సులభంగా రుణాలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ క్రమంలో కొత్తగా గ్రూపులు ఏర్పాటు చేసుకోవడానికి మహిళలు ముందుకు వస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా చేరిన వారికి ఆరు నెలలు పూర్తయితే చాలు ఐదు లక్షల వరకు బ్యాంకు రుణం అందిస్తుంది. ఒక డ్వాక్రా గ్రూపులో పదిమంది ఉన్నట్లయితే ఒక్కొక్కరికి 50,000 చొప్పున బ్యాంకు రుణం ఇస్తుంది. సకాలంలో ఈ రుణాన్ని బ్యాంకుకు చెల్లిస్తే గ్రూపు రుణపరిమితి క్రమంగా పెరుగుతుంది. ఇక ఆ తర్వాత 20 లక్షల వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది.