DWACRA Women: రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఒక భారీ శుభవార్తను తెలిపింది. దీనికి సంబంధించి పండగ వేల ఒక కీలక ప్రకటన చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. డ్వాక్రా సంఘాల మహిళలకు ఇది అద్భుతమైన అవకాశమని తెలుస్తుంది. సాధారణంగా అయితే గేదెలు, ఆవులు సబ్సిడీ రూపంలో ఇస్తారు. కానీ ఇప్పుడు కోళ్లను కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అనంతపురం గుత్తిలో ప్రజా నాయకుడు ఎస్టి డ్వాక్రా సంఘాల మహిళల కోసం కోళ్లను కూడా సబ్సిడీ రూపంలో ఇచ్చి వాళ్లను ఆర్థికంగా ఎదగాలని చెప్తున్నారు. వాళ్ల జీవితంలో ఆర్థిక పునాదులకి పెట్టుబడి ఇదే కావాలని ఆయన చెప్పుకొచ్చారు.
శుక్రవారం రోజు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ డ్వాక్రా సంఘం ఎస్టీ మహిళలకు సబ్సిడీతో కూడిన కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ ఆయన సోదరుడు గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు శుక్రవారం రోజున డ్వాక్రా సంఘం ఎస్టీ మహిళల కోసం సబ్సిడీ కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తి మండలం డ్వాక్రా సంఘం ఎస్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఒక యూనిట్ 11 అలాగే ఐదు పుంజుల చొప్పున ఒక్క యూనిట్ 6వేల రూపాయలకు అందించారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఇక ఇందులో ప్రభుత్వం సబ్సిడీ 3600 అలాగే లబ్ధిదారుల వాటా 2400గా ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు అందించిన ఒక యూనిట్ 11 యూనిట్లుగా వృద్ధి చెంది 6000లను 66 వేల రూపాయలు సంపాదించాలని అలాగే కోళ్ల పెంపకానికి 30 కేజీల దాన మరియు దానికి సరిపడా మెడిసిన్ కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. అలాగే అభివృద్ధి మరియు మహిళా అభ్యుదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను డ్వాక్రా సంఘాల ఎస్టీ మహిళలు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు.