Women Empowerment: మహిళలకు 3 భారీ శుభవార్తలు చెప్పిన ప్రభుత్వం.. వీటిని మిస్ కాకండి

Women Empowerment
Women Empowerment

Women Empowerment: ప్రతి రాష్ట్రం కూడా తమ రాష్ట్రంలోని మహిళలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్లకు సహాయం అందిస్తుంది. దీంతో మహిళలు ప్రతి రూపాయిని జాగ్రత్త చేస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. దీనికోసం ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేలా ఇప్పటివరకు మహిళల కోసం అనేక కార్యక్రమాలను అమలులోకి తెచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ముఖ్య లక్ష్యం అని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.

ఈ ముఖ్య ఉద్దేశంతోనే మంత్రి సీతక్క బుధవారం రోజున మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మరియు ఇషా ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క ఈ ఏడాది మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రూ.20 వేలకోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా మహిళలకు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు రద్దీ ఉన్న ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన మరియు స్థానిక ఆహార పదార్థాలతో తయారుచేసిన వంటలను అందిస్తున్నట్లు సూచించారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గా ఎదగాలని అలాగే స్థానిక వనరులను ఉపయోగించి ప్రజల అవసరాలకు తగినట్లుగా వ్యాపార నమూనాలను రూపొందిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు మీసేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, సోలార్ లైట్స్ వ్యాపారాలు, డైరీ ఫార్మ్లు, పౌల్ట్రీ ఫారాలు వంటి వివిధ రంగాలలో కూడా రాణించేలాగా వాళ్లకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల ద్వారా 60 లక్షల పాఠశాల యూనిఫామ్ లను కుట్టిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now