Govt Schemes: ఈ పండగ సీజన్ లో కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చింది. రంజాన్, హోలీ పండగల సీజన్ లో గ్యాస్ సిలిండర్ ఖరీదైనదిగా మారింది. అయితే ప్రభుత్వ చమూరు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్లా ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మార్చి 1, 2025 నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర అమలులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ మార్చి ఒకటి నుంచి వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను ఆరు రూపాయలు పెంచడం జరిగింది.
దాంతో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ.1797 నుంచి రూ.1803 కు చేరుకుంది. అయితే 14 కిలోల గృహోపకరణ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతం పెరిగిన కొత్త గ్యాస్ ధరలు ఈరోజు శనివారం నుంచి వర్తిస్తాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ప్రస్తుతం 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ. 1803 కు లభిస్తుంది. అయితే గత ఫిబ్రవరిలో ఈ ధర రూ.1797 గా ఉండేది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
అలాగే ఫిబ్రవరి నెలలో కోల్కతాలో రూ.1907 గా ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.1913 చేరుకుంది. ముంబై నగరంలో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ.1755.50 గా ఉంది. అలాగే ఫిబ్రవరి నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1749.50 గా ఉండేది. చెన్నై నగరంలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర స్వల్పంగా పెరిగి రూ.1959 నుంచి ప్రస్తుతం గా ఉంది. ప్రస్తుతం వాణిజ ఎల్పిజి సిలిండర్ ధరలో పెరగడంతో రెస్టారెంట్లు కూడా ఫుడ్ ధరలను పెంచే అవకాశం ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ.803 వద్ద స్థిరంగా ఉంది.