Kidnap Mistory: మెట్ పల్లి,ఆగస్టు14(ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీసులు రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసుని 24 గంటల్లో చెందించారు. బుధవారం మెట్ పల్లి తన కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని దుబ్బవాడలో నివసిస్తున్న లక్ష్మి రాజుల రెండు సంవత్సరాల కుమారుడు శివను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్నప్పటి నుండి కిడ్నాప్ కు గురైన బాలుడి కోసం 6 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామానికి చెందిన ఇస్లావత్ నగేష్ అనే యువకుడు మెట్ పల్లి పట్టణంలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. సదరు యువకుడు జల్సాల కోసం అలవాటు పడి బాలుడిని కిడ్నాప్ చేసి 1లక్ష 50 వేల రూపాయలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకొని ఈ కిడ్నాప్ కు పాల్పడ్డట్లు తమ విచారణలో సదరు యువకుడు వెల్లడించినట్లు ఎస్పి పేర్కొన్నారు.
6 ప్రత్యేక పోలీస్ బృందాలు
ఈ కేసుని చెందించేందుకు మెట్ పల్లి డివిజన్ పోలీసులు 6 బృందలుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ లని పరిశీలిస్తూ నిందితుని ఆచూకీ కోసం వెతికి పట్టుకున్నట్లు చెప్పారు. ఆచూకీలభ్యమైన బాలుని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మెట్ పల్లి డీఎస్పీ ఉమ మహేశ్వర్ నేతృత్వంలో ఆరు పోలీస్ బృందాలు కిడ్నాప్ కేసు చేదించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, కోరుట్ల సీఐ సురేష్, సీసీఎస్ సీఐ లక్ష్మి నారాయణ, మెట్ పల్లి ఇబ్రహీంపట్నం, మల్లపూర్ ఎస్ఐలు చిరంజీవి, అనిల్, కిరణ్ కుమార్, రాజు, స్పెషల్ పార్టి సిబ్బంది పాల్గొన్నారు