Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 57 అంతస్తుల్లో అతి ఎత్తైన భవనం బాగా గుర్తింపు చెందింది. ఈ ఎత్తయిన భవనం కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా నగరానికి కూడా ల్యాండ్ మార్క్ గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రపంచంలో ఎత్తైన భవనం ఏది అంటే ముందుగా అందరికీ గుర్తుచేది దుబాయిలో ఉన్న బుర్జ్ ఖలీఫా.
కానీ మన దేశంలో ఎత్తైన భవనం ఏది అంటే చాలామందికి తెలిసి ఉండదు. మనదేశంలో ముంబైలో ఉన్న ఇంపీరియల్ టవర్ 1, టవర్ 2 ఎత్తయిన భవనాలుగా గుర్తింపు చెందాయి.తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో కూడా అత్యంత ఎత్తైన భవనం కోకాపేట్ లో సాస్ క్రౌన్ పేరుతో ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఇది హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నిర్మించిన భవనాలలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ ఇదే. 4.5 ఎకరాల విస్తీర్ణం లో ఏకంగా 57 అంతస్తులో నివాస భవనంగా దీనిని నిర్మించారు.
ఈ భవనం పై ఫ్లోర్ నుంచి చూస్తే సగం హైదరాబాద్ కనిపించడం జరుగుతుంది. అలాగే కింద నుంచి ఈ భవనం పైకి చూస్తే ఆఖరి ఫ్లోర్ ఎక్కడుందో కూడా కనిపించదు. హైదరాబాద్ నగరానికి ఈ పెద్ద బిల్డింగ్ ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ గా మారనుంది. అయితే ఈ అతి ఎత్తైన బిల్డింగ్లో ఒక అంతస్తుకు కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఇటువంటి భారీ బిల్డింగ్ లో మరికొన్ని ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఏకంగా 62 అంతస్తులు తో నిర్మించాలి అనుకున్న మరో భవనం ప్రస్తుతం అనుమతి పొందే దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ 62 అంతస్తుల భవనం నిర్మాణం జరిగితే 57 అంతస్థల భవనం రికార్డు బ్రేక్ అవుతుందని చెప్పొచ్చు.