T.U University: కామారెడ్డి, ఆగస్ట్ 06 (ప్రజా శంఖారావం): తెలంగాణ జాతిపిత, సిద్ధాంత కర్త ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషిని విద్యార్థులు అధ్యయనం చేయాలని సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ డా.రాజేశ్వరి అన్నారు. మంగళవారం ఆయన జయంతిని పురస్కరించుకొని దక్షిణ ప్రాంగణంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వైస్ ప్రిన్సిపాల్ డా.రాజేశ్వరి
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్ అని అన్నారు. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ఎలుగెత్తి చాటారని తెలిపారు. నీళ్ళు, నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించారనీ, అందుకే ఆయన జీవితాన్ని ,ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులు అధ్యయనం చెయ్యాలని పిలుపునిచ్చారు. వారికి సంబంధించిన పుస్తకాలను లైబ్రరీ లో పెట్టించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి డా. ఎస్.నారాయణ అధ్యక్షత వహించగా అధ్యాపకులు డా .లలిత, హాస్టల్ వార్డెన్ లు డా. యాలద్రీ, డా.సునీత, ఏపిఆర్ఓ డా.సరిత పిట్ల,అధ్యాపకులు డా.రమాదేవి, డా.నర్సయ్య, డా.ఇంద్రకరణ్ రెడ్డి, డా. శ్రీకాంత్, డా.కనకయ్య, డా.శ్రీనివాస్, డా.రమేష్, డా.వెంకట్ రెడ్డి, డా. సునీల్, విజయ్ కుమార్, శ్రీకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.