Student died: జుక్కల్, ఆగస్టు 31 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి (14) బాన్సువాడ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. గత రెండు రోజులుగా విద్యార్థినికి తీవ్రమైన జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థిని పరిస్థితి విషమించడంతో తల్లి చౌత్రబాయికి పాఠశాల ఉపాధ్యాయులు సమాచారం అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి విద్యార్థిని తీసుకెళ్తున్న సమయంలో విద్యార్థుని మృతి చెందింది. పాఠశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ కూతురు అంజలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినికి చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆ ఇద్దరు కూతుర్ల ఆలనా పాలన తల్లి చూసుకుంటూ ఉంటుంది. ఒక కూతురు మృతి చెందడంతో తల్లిరోధనాలు మిన్నంటాయి. శనివారం ఉదయం పాఠశాలను జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డిఓ కిరణ్ గౌడ్, డిఎండబ్ల్యూఓ దయానంద్ లు పరిశీలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలను పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను వారు అడిగి తెలుసుకున్నారు.
Student died: డెంగ్యూతో విద్యార్థిని మృతి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now