Social boycot: మెట్ పల్లి, ఆగస్టు 08 (ప్రజా శంఖారావం): మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో గుడేటి కాపు కుల సంఘానికి సామాజిక బహిష్కరణ విధించినట్లు సమాచారం. గ్రామంలో ఏడాదిన్నర కిందట కుల సంఘాల మధ్య ఒక స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరక ఆ సామాజిక వర్గానికి సహాయ నిరాకరణ విధించినట్లు తెలుస్తోంది.
మధ్యలో కొన్నాళ్ళు గొడవ సద్దుమణిగిన, ఇటీవల మళ్లీ స్థలానికి సంబంధించి ఓ విషయమై వివాదం తలెత్తినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంలో తాము చెప్పినట్లు చేయాలని గుడేటి కాపు కులానికి చెందిన ఒకరిపై పలు కుల సంఘాలు ఒత్తిడి చేయగా అందుకు నిరాకరించడంతో గుడేటి కాపు కుల సంఘ సభ్యులకు రెండ్రోజుల నుంచి పలువురు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు వినికిడి.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now