RRC Railway Jobs 2025: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్తను తెలిపింది. తాజాగా కేవలం పదవ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్పులు మరియు సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఆన్లైన్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కు చెందిన చత్తీస్గడ్ లోని రాయపూర్ లో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వ్యాగన్ రిపేర్ షాప్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈ నోటిఫికేషన్ ద్వారా 1003 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు కనీసం 50% మార్కులతో పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రైన్లలో ఐటిఐ కోర్స్ పూర్తి చేసి ఉండాలని సమాచారం. అభ్యర్థుల వయస్సు 2025, మార్చి మూడు నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పదేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.
ఈ పోస్టుల కోసం అర్హత ఉన్న అభ్యర్థులకు ఒక ఏడాది పాటు అప్రెంటీన్ షిప్ కింద శిక్షణ ఇప్పిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 2, 2025 రాత్రి 11.59 గంటలలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. వంద రూపాయలు చొప్పున చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. అభ్యర్థుల విద్యార్హతలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అధికారులు తుది ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు మీరు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.