Road Accident: నిజామాబాద్ క్రైమ్, ఆగష్టు 28 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ రూరల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఇప్పటికక్కడే దుర్మరణం చెందాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్, స్థానికుల కథనం ప్రకారం..
శ్రీనగర్ లోని గజానంద్ రైస్ మిల్ వద్ద గత రెండు రోజులుగా లారీ గుంతలో దిగబడి ఇరుక్కుపోయింది. కాదా అది రూట్ లో మాక్లూర్ మండలం చిక్లి గ్రామానికి చెందిన యువకుడు వంశిని అతడి గ్రామంలో దింపేందుకు నిజామాబాద్ పట్టణానికి చెందిన మరో యువకుడు రాజేశ్ అతని మరో స్నేహితుడు అశోక్ ను డ్రైవింగ్ చేయమని వెంట తీసుకువెళ్లాడు.
స్వగ్రామానికి వెళుతుండగా..
ముగ్గురు కలిసి కారులో తెల్లవారుజామున మృతుడు వంశీ స్వగ్రామం చిక్లి గ్రామానికి వెళుతుండగా ఆకుల కొండూర్ మార్గంలో రైస్ మిల్ ఎదురుగా ఆగి ఉన్న లారీని మీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా ఢీకొంది. అతివేగంగా కారు ఢీకొనడంతో కారు పైభాగం ముందటి భాగం పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఘటనా స్థలంలోనే వంశి (17), రాజేశ్ (19) ఇద్దరు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
కాగా డ్రైవింగ్ చేస్తున్న మరో యువకుడు రాజేష్ రెండు కాళ్లు కారు ముందు భాగంలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన రోడ్డు ప్రమాదం పై వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బంధువులు, స్నేహితుల ఆందోళన..
రైస్ మిల్ ఎదురుగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జరిగిన రోడ్డు ప్రమాదం తెలుసుకోని మృతుని స్నేహితులు, బంధువులు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. లారీని రోడ్డుకి అడ్డంగా నిలపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు మృతుల బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. స్థానిక రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందజేయాలంటూ, మృతదేహాలను తరలించకుండా నిరసన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.