MLA SANJAY: మెట్ పల్లి, ఏప్రిల్10 (ప్రజా శంఖారావం): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్ పల్లి మండలం రామలచక్కపేట్, ఆత్మనగర్, ఆత్మకూర్, మెట్ల చిట్టాపూర్ గ్రామాల్లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ దీపిక, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మెట్ల చిట్టపూర్ ప్యాక్స్ చైర్మన్ నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now