Revenue Officers: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 09 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ శివారులో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 202 లో అక్రమ ఇంటి నెంబర్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న వార్తా కథనానికి స్పందించి ఆర్మూర్ ఆర్డీవో రాజు గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ గజానన్ శుక్రవారం సర్వేనెంబర్ 202 లోని భూమిని పరిశీలించారు.
ఈ నెల 4న “ప్రజా శంఖారావం” తెలుగు దినపత్రికలో ప్రచురితమైన “అసైన్మెంట్ భూముల్లో ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్లు” అనే శీర్షికకు స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ భూమిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గోడలతో నిర్మించిన వాటిని పరిశీలించారు.
తాసిల్దార్ గజానన్ మాట్లాడుతూ
అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదు మేరకు అసైన్మెంట్ భూముల్లో ఏర్పాటు చేసిన గోడలను పరిశీలించామని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఏదైతే అసైన్డ్ భూమి ఉందో వాటి హద్దులను గుర్తించి డి మార్కెషన్ చేసిన అనంతరం మున్సిపల్ కమిషనర్ కు అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్లను రద్దు చేయమని లేఖను అందజేస్తామన్నారు.
రెవెన్యూ మండల సర్వేయర్ ప్రస్తుతం అందుబాటులో లేరని సర్వేయర్ వచ్చిన అనంతరం ఏదైతే అసైన్మెంట్ భూమి ఉందో వాటికి డీ మార్కెషన్ చేసిన అనంతరం అసైన్మెంట్ భూముల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ అన్నారు.
స్థల పరిశీలన చేసిన వారిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ తో పాటు ఐకెపి సర్వేయర్ చందు, స్థానిక 7వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జి దూదిగామ నటరాజ్ తదితరులు ఉన్నారు.