Police Arrest: బాన్సువాడ, సెప్టెంబర్ 01 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న మమత శుక్రవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు కేసు మిస్టరీని చేదించి, హత్యగా నిర్దారింఛి నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించి ఆదివారం సీఐ కృష్ణ వివరాలను వెల్లడించారు. బీర్కూరు మండలం బరంగెడ్దికి చెందిన మమత, ప్రశాంత్ లు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిన మమతను ప్రశాంత్ అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం ఆమె గొంతుకు చున్ని బిగించి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు. అనంతరం మమత మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వదిలి వెళ్ళినట్లుగా చెప్పారు. మృతురాలి కుటుంబ సభ్యులు మమత మృతి పట్ల ఆందోళన చేసి, ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన ప్రశాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ వెల్లడించారు.