One Nation One Election: వెబ్ డెస్క్, సెప్టెంబర్ 18 (ప్రజా శంఖారావం): వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో మోడీ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధితమే. ఈ ప్రక్రియలో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో చైర్మన్ గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినేట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలకు ముందడుగు పడినట్లు అయింది. రానున్న శీతాకాల సమావేశంలో మోడీ మంత్రి వర్గం పార్లమెంటులో ఈ బిల్లు ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కానీ రాజ్యాంగ సవరణ, అన్ని రాష్ట్రాల ఆమోదంతోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఏ మేరకు జమిలి ఎన్నికల ప్రతిపాదన ఫలిస్తుందో చూడాలి.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now