NPDCL: మెట్ పల్లి, మార్చి 4 (ప్రజా శంఖారావం): వినియోగదారుల సేవలో నాణ్యమైన పారదర్శకమైన సేవలు అందించడంలో విద్యుత్ లైన్మెన్ల పాత్ర ప్రశంసనీయమని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ షాలిని నాయక్ పేర్కొన్నారు. లైన్మెన్ దివాస్ సందర్భంగా మంగళవారం మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ పురోభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు క్షేత్రస్థాయిలో లైన్మెన్లు అహోరాత్రులు శ్రమించి మంచి సేవలు అందిస్తున్నారని సిబ్బందిని కొనియాడారు. లైన్మెన్లు పనికి ఉపక్రమించేటప్పుడు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
రాష్ట్రంలో ఐటీ రంగం, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల కొరకు వేలాది కోట్ల విదేశీ పెట్టుబడులకు విద్యుత్ రంగంలో అద్భుతమైన మౌలిక వసతులు కారణమని, అందుకు క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యుత్ సిబ్బంది అవిశ్రాంత కృషి రాష్ట్ర పురోభివృద్ధికి ఒక కారణమని ఆమె వెల్లడించారు.