New Rules: కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ముఖ్యమైన అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో భారీ జరిమాణాలు ఎదుర్కోవాల్సిందే. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న వాళ్లు ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే. లేకపోతే వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జేబులో ఉన్న డబ్బులకు చిల్లులు పడతాయి. ఎందుకంటే భారీ జరిమాణాలు విధించేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్యనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ లేకుండా చూడడానికి జిహెచ్ఎంసి కొత్త విధానాన్ని అమలులోకి తేనుంది.
ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం పక్క ప్లాన్ తో ముందుకు వెళుతుంది. జిహెచ్ఎంసి అధికారులు రూల్స్ బ్రేక్ చేసిన వారిపై భారీగా జరిమాణాలు విధించేందుకు రెడీ అవుతుంది. జిహెచ్ఎంసి కమిషనర్ విలంబర్తి ముఖ్యంగా నగర పరిశుభ్రతపై దృష్టి సారించారు. స్వచ్ఛ హైదరాబాద్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారు. సరికొత్త యాప్ ని కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే దిగజా ఐటీ కంపెనీ అయినా టి సి ఎస్ కు ఈ అప్ తయారీ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారానే రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళకి జరిమానాల విధింపు ఉంటుందని సమాచారం.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ట్రాఫిక్ చలానాలు ఎలా అయితే విధిస్తారో అలాగే రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళకి ఫోటో తీసి అందుకు జరిమానా విధిస్తారు. పక్కాగా వివరాలు అన్ని ఉంటాయి. త్వరలోనే ఈ యాప్ వినియోగంపై జిహెచ్ఎంసి అధికారులకు శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ సరికొత్త యాప్ నెల రోజుల్లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. జరిమాన వివరాలు కస్టమర్ మొబైల్ ఫోన్ నెంబర్ కు కూడా వచ్చేలా చూస్తున్నారు. ఉల్లంఘన ఆధారంగా విధించే జరిమానా కూడా మారుతుందని సమాచారం. ఒకవేళ ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే పదివేల నుంచి 25 వేల వరకు జరిమానా ఉంటుంది. మొదటిసారి తప్పకు 10000 జరిమాన పడుతుంది. రెండోసారి అయితే 25000 జరిమానా కట్టాలి. ఆ తర్వాత కూడా తప్పు జరిగితే షాప్ క్లోజ్ చేస్తారు. నాలాల్లో చెత్త పారేస్తే 10000 జరిమానా చెల్లించాలి.