MLA Camp Office: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 28 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నడి ఒడ్డున ఉన్న స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా గుర్తింపు (నేమ్) బోర్డ్ ఏర్పాటు చేయలేకపోవడం హాస్యాస్పదం. గత ప్రభుత్వం హయాంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ నిధుల నుండి కోటి రూపాయల వ్యయంతో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఇప్పటివరకు బోర్డు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. 2020 సంవత్సరం జనవరి 30న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు క్యాంపు కార్యాలయం అంటూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కనబడుతుంది. ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు క్యాంపు కార్యాలయం బోర్డు లేకపోవడంతో స్థానికంగా ఉండే వారిని అడ్రస్ అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మాక్లూర్, నందిపేట్ మండలాలలోని గ్రామాల ప్రజలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సి.ఎం.ఆర్.ఎఫ్, అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండే సిబ్బందిని కలవడానికి వచ్చినప్పుడు కార్యాలయంకు పేరు బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేని అధికారులు ఇకనైనా బోర్డు ఏర్పాటు విషయంలో స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
MLA Camp Office: నాలుగు సంవత్సరాలుగా పేరు లేని భవనం..?
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now