Movie hero NTR’s Donation: వెబ్ డెస్క్, సెప్టెంబర్ 03 (ప్రజా శంఖారావం): తెలుగు రాష్ట్రాలకు సినీ హీరో భారీ విరాళం ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణకు 50 లక్షలు, ఏపీకి 50 లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేస్తున్నట్లు మంగళవారం ఆయన ట్విట్ చేశారు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడ్డ వరద విధ్వంసం కారణంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సహాయ చర్యలకు తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా విరాళం అందజేస్తున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వర్ష బీభత్సం అంధకారంలోకి నెట్టిందని, ఈ విపత్తు తనను ఎంతగానో కలిచి వేసిందని ఎన్టీఆర్ అన్నారు. వరద విపత్తు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షల రూపాయల విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.