Metpally: మెట్ పల్లి, మార్చి10 (ప్రజా శంఖారావం): పసుపు రైతుల ధర్నా విజయవంతం చేయాలనీ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.
మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డును సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పసుపుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు మంగళవారం చేస్తున్న ధర్నాకు ప్రతి ఒక్క రైతు అన్ని పార్టీలకు అతీతంగా ధర్నా లో పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.
ఓట్ల కోసం రైతులను మోసం చేస్తూ పదవిలు తీసుకొని పబ్బం గడుపుతున్న నాయకులని నిలదీయాలని అన్నారు. అంబాసిడర్ అని ఒక రోజు, బెంజ్ కార్ అని ఇంకో రోజు రైతులను ఓట్ల కోసం వాడుకునే నాయకులని ప్రశ్నించాలనీ కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చే సీజన్ లో పసుపు రైతులు కోటీశ్వరులు కాబోతున్నారని విచ్చల విడిగా అబద్ధాలు మాట్లాడిన నాయకులు ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేసారు. బోర్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం, 15వేల మద్దతు ధర అని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పార్టీలు ఓట్ల కోసం పసుపు రైతులను మోసం చేసాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.