Viral Video: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన సిద్ధుల గుట్టపై చిరుత పులి సంచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఆలయ సభ్యులతోపాటు భక్తులకు గత నెల క్రితం గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లుగా కనబడిందని కొంతమంది వాపోయారు.
తిరిగి సోమవారం మధ్యాహ్నం సమయంలో కొంతమంది భక్తులు ఆలయానికి వెళ్లిన సమయంలో సిద్దుల గుట్టపై అటుగా వెళుతున్న చిరుత పులి కనబడడంతో కొంతమంది భక్తులు సెల్ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలయ కమిటీ సభ్యులు జిల్లా ఫారెస్ట్ అధికారులకు చిరుత పులి సంచారం పై సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది. గుట్టపైకి భక్తులు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు సూచిస్తున్నారు.
ఆర్మూర్ లో సిద్ధుల గుట్టపై చిరుత పులి సంచారం..! pic.twitter.com/2wi27rOsDK
— Prajashankaravam (@Prajashanka) April 28, 2025