Small Mini AC: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండ వేడి తట్టుకోలేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటాం. మరి ముఖ్యంగా మన ఇంట్లో వేసవి తాకిడి నుండి తట్టుకునేందుకు విండో కూలర్లు, ఏసీలు ఫ్యాన్లతో ఇలా ప్రత్యమ్నయా ఉపశమనాన్ని పొందుతాం. అలాగని ఇంట్లో నాలుగు గదులు ఉంటే అన్నిట్లో కూలర్లు, ఏసీలు పెట్టుకొని ఎండవేడి నుండి ఉపశమనం పొందే ఆర్థిక స్థోమత మధ్యతరగతి కుటుంబాల్లో చాలా తక్కువ. ఇలాంటి వారి కోసమే ఈ మినీ ఏసీ రూపొందించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో ఉన్న వేడిగాలని కూడా బయటకు పంపించేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఈ మినీ ఏసీ అందరిని ఆకట్టుకునేలా ఉంది. వివరాలు ఏంటో తెలుసుకుందాం..!
ఎండాకాలం మొదలైంది అంటే చాలు విండోకు కూలర్లతో పాటు గదుల్లో ఏసీలు పెట్టి ఎండవేడి నుండి మనం ఉపశమనం పొందుతాం. కానీ ఇక్కడ ఏంటంటే కూలర్లు, ఏసి, ఫ్యాన్లు ఉన్నచోటే మనం వెళ్లి కూర్చొని ఎండ వేడి నుండి ఉపశమనం పొందాలి. మరి ఈ మినీ ఏసీ స్పెషల్ ఏంటంటే.. మనం ఎక్కడ కూర్చున్న దాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని వేడి గాలి నుండి ఉపశమనం పొందొచ్చు. అదే మరి ఈ స్మాల్ ఏసి స్పెషల్..
మామూలుగా మనం విండో వద్ద కూలర్ పెట్టుకోవాలి అంటే ఒక స్టాండ్ ఏర్పాటుచేసి దానిపై కూలర్ ను అమర్చుతాం. గదిలో ఏసి పెట్టాలి అంటే నాలుగు వైపులా గోడకు ఒక దిక్కు మన కంఫర్ట్ ను బట్టి ఏసీని ఒక వైపు గోడకు బిగించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే అద్దె ఇంట్లో ఉన్నవారికి కాస్తంత ఇబ్బంది అని చెప్పవచ్చు. కానీ ఈ మినీ ఏసీ తో అలాంటి బాధలేమి ఉండవు. ఇంట్లో ఏ గదిలోకైనా తీసుకెళ్లి ఏర్పాటు చేసుకొవచ్చు.. అంతేకాదు ఒక గది నుండి మరో గదిలోకి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఇంట్లో ఉన్న గదులన్నీ చల్ల చల్లగా.. కూల్ అవుతాయి. అంతేకాదు దీనికి ఒక చక్కని రిమోట్ సిస్టం, అటూ ఇటు (swing) తింపుకునేలా వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ మినీ ఏసీకి కింద నాలుగు చక్రాలు (wheels) అమర్చబడి ఉంటాయి. ఒక గది నుండి మరో గదిలోకి ఈజీగా తీసుకువెళ్లొచ్చు.
మార్కెట్లో లభించే వివిధ కంపెనీల AC లు:
మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీలకు చెందిన ఏసీలు లభిస్తాయి. ముఖ్యంగా LG, Samsung, Daikin, Voltas, Panasonic, Bluestar, LIoyd, ఇలా ఒక కంపెనీ ఏంటి చాలా కంపెనీలకు సంబంధించిన ఏసీలు మార్కెట్లో లభిస్తున్నాయి. మళ్లీ ఇందులో కొన్ని రకాలుగా 1ton, 1.5ton, 2tons అని విభజించి ధరను బట్టి, గదుల సైజులను బట్టి ఏసీలు ఏర్పాటు చేసుకుంటారు. వీటి ధర మధ్య తరగతి కుటుంబాల వారికి అందుకోలేనంతగా ధరలు ఉంటాయి. కానీ ఈ మిని AC ని గదిలో ఏ గోడకు పెట్టాల్సిన అవసరం లేదు. దీని ధర కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది.
ఈ ఏసీ ఆకారం మనం ఇంట్లో ఉపయోగించే వ్యాక్యూమ్ క్లీనర్ మాదిరిగా ఉంటుంది. చిన్న సైజు పరిమాణంలో ఉండి, ఒక పొడవాటి పైపు కలిగి ఉంటుంది. బరువు కూడా తక్కువే. చాలా రకాల కంపెనీలకు చెందిన ఈ Small Mini AC లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వ్యాక్యూమ్ క్లీనర్ కు ఉన్నట్లుగానే కింద ఈ AC కి చక్రాలు కూడా ఉండడంతో ఒకచోటి నుండి మరోచోటికి తీసుకు వెళ్ళడానికి కంఫర్ట్ గా ఉంటుంది. ప్రస్తుతం ఇది ఆన్లైన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉండడంతో ఈజీగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని కంపెనీలు EMI అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి.