Small Business: ఈరోజుల్లో యువత ఒకరి చేయి కింద పనిచేయడం కంటే వ్యాపారం చేసి సొంతంగా డబ్బు సంపాదించాలనుకునే వారి సంఖ్య ఎక్కువ. అలాగే వ్యాపారంలో వచ్చిన లాభాల కంటే ఉద్యోగంలో వచ్చే సంపాదన తక్కువ అని వారి అభిప్రాయం కూడా. ఇలాంటి వారి కోసమే తక్కువ పెట్టుబడితో నెల నెల మంచి లాభం వచ్చే వ్యాపారం ఒకటి మీకోసం…
Low Investment Business Ideas: పరిగెత్తి.. పరిగెత్తి.. పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అన్నచందంగా ప్రస్తుత యువత ఆలోచన ధోరణి మారుతోంది. ఉద్యోగాలు చేయడానికి ఉన్న ఊరుని వదిలి ఎక్కడో దూరంగా ఒకరి చేయి కింద పనిచేసి సంపాదించడం కంటే.. ఉన్న ఊర్లోనే ఒక మంచి వ్యాపారం చేసుకొని కుటుంబంతో హాయిగా గడపాలనేది నేటి యువత ఆలోచన. ఒత్తిడితో పనిచేస్తూ సతమతం అవడం కంటే హాయిగా చిన్న పెట్టుబడితో వ్యాపారం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా సంపాదించుకునే వారి కోసమే ఈ వ్యాపారం ఐడియా..
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
మరో అవకాశం కూడా ఉంది మీరు ఇదివరకే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే పార్ట్ టైం గా ఈ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. కేవలం ₹ 1000 రూపాయల పెట్టుబడి పెట్టి సులువుగా ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకునే వ్యాపారం. పూర్తి వివరాలు మీకోసం..
ఈ వ్యాపారానికి ఒత్తిడి ఉండదు. ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. అలాగే ఇద్దరు ఉంటే చాలు హాయిగా బిజినెస్ చేసుకోవచ్చు. చాలామందికి వ్యాపారం చేయాలంటే పెట్టుబడి అవసరం ఉంటుంది. తీరా అక్కడ ఇక్కడ అప్పుచేసి పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో.. నష్టాలు చవిచూడాల్సిన.. పరిస్థితి ఉంటుందో అన్న అనుమానం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయే పెట్టుబడి వ్యాపారం చిన్న పెట్టుబడితో మొదలుపెట్టి ప్రతి నెల దాదాపు 30 వేల రూపాయలు సంపాదించే వ్యాపారం కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఆలుగడ్డలతో తయారుచేసే పొటాటో చిప్స్ బిజినెస్. ఈ వ్యాపారానికి రోజుకు 2-3 గంటల సమయం కేటాయిస్తే సరిపోతుంది. మళ్లీ పెద్దగా వర్కర్లు కూడా ఈ వ్యాపారానికి అవసరం ఉండదు. ఒకరిద్దరు ఉంటే ఇంట్లో వాళ్ళతో కలిసి హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వ్యాపారంలో నెల తిరిగే సరికి 30వేల రూపాయల లాభాలను గడించవచ్చు.
తినుబండారాలకు, క్యాటరింగ్ వ్యాపారంలో ఆలు చిప్స్ బిజినెస్ కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఈ స్నాక్స్ ను చాలా ఇష్టపడి తింటారు. బయట షాపుల్లో విక్రయించే చిప్స్ ప్యాకెట్ ల కంటే మనం స్వయంగా ఇంట్లో రెడీ చేసుకొనే ఈ చిప్స్ ఆరోగ్యానికి మంచివి అలాగే ఇంట్లో రెడీ చేసి బయట సప్లై చేసి చిన్న చిన్న షాపుల్లో విజ్రయించా జనాలు మరింత ఆసక్తి చూపుతారు. అలాగే ₹ 10-20 రూపాయల ప్యాకెట్స్ చొప్పున చేసి బయట షాపుల్లో మార్కెటింగ్ చేసుకుంటే చాలా లాభంగా ఉంటుంది. మొత్తం ఒకరోజుకి ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం చేస్తే నెల తిరిగే సరికి ₹ 30 వేల వ్యాపారం జరుగుతుంది. దీనికి కావలసిన మిషన్ కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. కేవలం బయట మార్కెట్లో 850 రూపాయలకే ఈ మిషన్ విక్రయిస్తారు. ఈ మిషన్ తో మనం చిప్స్ తయారు చేసే సమయంలో ఎక్కువ కరెంటు కూడా అవసరం ఉండదు, అలాగే మిషన్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంట్లో స్థలం కూడా ఎక్కువగా ఆక్రమించుకోదు. దీనికి కావలసింది మంచి నాణ్యమైన వంట నూనెతో పాటు ప్రతినిత్యం మార్కెట్లో దొరికే ఆలుగడ్డలను సమకూర్చుకోవడం. వ్యాపారానికి తగ్గట్టుగా మార్కెటింగ్ లో చిన్న చిన్న షాపుల్లో మార్కెటింగ్ చేస్తూ ఎక్కువ మొత్తంలో ఈ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే మంచి లాభాలను గడించవచ్చు.