intermediate exams: ఇంటర్ బోర్డు తప్పిదం..! విద్యార్థుల్లో ఆందోళన.. మళ్లీ మార్కులు ఆడ్..?
ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షలలోని క్వస్షన్ పేపర్లలో వరుస తప్పులు. దీంతో విద్యార్ధులు ఆందోళనకు లోనవుతున్నారు. ఈనెల10న జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ క్వస్షన్ పేపర్ లో 4 మార్కుల ప్రశ్న సరిగ్గా ప్రింట్ కాకపోవడంతో ఆ ప్రశ్నను అటెండ్ చేసిన వారందరికీ 4 మార్కులను కలుపుతామని తాజాగా ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఆరోజు నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల క్వశ్చన్ పేపర్ లలో క్రమంగా తప్పులు దొర్లుతున్నాయి.
ఈనెల మార్చి 10న జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పేపర్ లో 4 మార్కుల ప్రశ్న సరిగ్గా ప్రింట్ కాకపోవడంతో ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన విద్యార్థులకు 4 మార్కులను కలుపుతామని తాజాగా ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఈనెల 11న జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధుల బోటనీ, పొలిటికల్ సైన్స్ తెలుగు, గణితం పేపర్-1ఏ, ఇంగ్లీష్ భాషల్లోని క్వస్షన్ పేపర్లో పలు ప్రశ్నలకు తప్పులు దొర్లినట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పూర్తిగా ప్రశ్నల అర్థం మారిపోవడంతో విద్యార్థులకు బాధలు తప్పలేదు. ఈ సబ్జెక్టులలోని ప్రశ్నపత్రాలలో రెండు చొప్పున మొత్తం 6 తప్పులు వచ్చాయి.
క్వశ్చన్ పేపర్ లో ఇలా తప్పులు…
పొలిటికల్ సైన్స్ పరీక్ష 20వ క్వశ్చన్ లో ‘జా’కి బదులు ‘జాతీయత’ అని, బోటనీలో 13వ ప్రశ్నలో ‘శాఖీయ’ బదులు ‘శాధీయ’ అని ప్రింట్ తప్పుగా వచ్చింది. మ్యాథమెటిక్స్ (తెలుగు)లో 4వ క్వశ్చన్ పేపర్ లో ‘కోటి’ అనే పదానికి బదులు ‘శ్రేణి’ అని, బొటనీ ఇంగ్లిష్ మీడియం పేపర్-1లో క్వశ్చన్ నంబర్-5లో ‘it is found’ అని ప్రింట్ అవల్సింది, క్వశ్చన్ పేపర్ లో ‘is it found’ అని ప్రింట్ తప్పు పడింది. 9వ క్వశ్చన్ లో ‘ప్రమేయాన్ని’ బదులు ‘ప్రమేయానికి’ అని తప్పుగా ప్రింట్ అయ్యాయి. అదే సబ్జెక్టు ఆంగ్ల మాధ్యమం 32వ క్వశ్చన్ లోనూ ‘important’ కు బదులు ‘importance’ అని మరో తప్పులు వచ్చాయి.
తప్పులు గుర్తించిన ఇంటర్‌బోర్డు
ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి క్వశ్చన్ పేపర్లలో ఈ తప్పులు గుర్తించిన ఇంటర్‌బోర్డు అధికారులు తప్పులను సరిదిద్దుకుని జవాబులు రాయాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు సమాచారం అందించారు. దీంతో పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిటేర్లు ఆయా క్వస్షన్ పేపర్లో ప్రింట్ అయిన పదాలకు సరైన పదాలను సూచించి, సమాధానం రాయాలని విద్యార్థులకు సూచించారు.