Ration Card Update: ఇలా చేయని వాళ్ళకి ప్రభుత్వం ప్రయోజనాలు కూడా రద్దు చేసే పనిలో ఉంది. మీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డును వీలైనంత త్వరగా లింక్ చేసుకోండి. లేకపోతే మీరు రేషన్ కార్డుకు సంబంధించి వివిధ ప్రయోజనాలను పొందలేరు. అలాగే మీరు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రేషన్ కార్డును మీ ఆధార్ కార్డు తో తప్పనిసరిగా లింక్ చేయాలి. ఒకవేళ చేయకపోతే రేషన్ ప్రయోజనాలు మీకు భవిష్యత్తులో లభించకపోవచ్చు.
కాబట్టి వీలైనంత త్వరగా మీ రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయండి. ఈ ముఖ్యమైన పనిని మీరు మీ ఇంట్లోనే స్మార్ట్ ఫోన్లో సులభంగా చేసుకోవచ్చు. రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసే ప్రక్రియ చాలా సులభం అని ఆహార శాఖ అధికారులు తెలుపుతున్నారు. మీరు మీ ఇంట్లో నుంచే రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ రేషన్ కార్డుతో ఆధార్ను లింక్ చేయండి అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు మీరు రేషన్ కార్డు నెంబర్ తో పాటు ఆధార్ కార్డు నెంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను ఇవ్వండి.
మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని అక్కడ నమోదు చేయండి. మీరు సమాచారం విజయవంతంగా సమర్పించిన తర్వాత కేవలం కొన్ని క్షణాల్లోనే ఆధార్ కార్డు రేషన్ కార్డుకు లింక్ అవుతుంది. ఒకవేళ ఆఫ్లైన్లో చేయాలని అనుకునేవాళ్లు తమకు సమీపంలో ఉన్న ఫుడ్ ఆఫీసు లేదా రేషన్ షాప్కు వెళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తో పాటు మొబైల్ నెంబర్ కాపీని సమర్పించి రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఆహార శాఖ వారు నిజమైన లబ్ధిదారులకు రేషన్ అంది ఎందుకు మరియు నకిలీ రేషన్ కార్డులో దుర్వినియోగదాన్ని ఆపడానికి ఈ లింకును తప్పని సరిచేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపల రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే భవిష్యత్తులో మీకు రేషన్ ప్రయోజనాలు రద్దు చేయబడతాయి.