Hyderabad: హైదరాబాద్, ఆగస్టు 09 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 13 నుంచి రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు. శనివారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక ప్రతి జిల్లాలోని అంగన్వాడీ పాఠశాలల్లో ప్లే స్కూల్స్ ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఈ ప్లేసులను తీర్చిదిద్దుతామని ఆమె వెల్లడించారు. సీఎస్ఆర్ ఫండ్స్‌ను కార్పొరేట్ సంస్థలు గ్రామాల్లో ఉప యోగించేందుకు సానుకూ లంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
అలాగే ప్రతి ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లా కలెక్టర్, తన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now