High Court Shock: వెబ్ డెస్క్, సెప్టెంబర్ 18 (ప్రజా శంఖారావం): బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నల్గొండలో నిర్మించిన పార్టీ భవనాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు అధికారులను ఆదేశించింది. మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా నిర్మించిన భవనంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
భవనం కూల్చకుండా, రెగ్యురేషన్ చేయాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును బిఆర్ఎస్ పార్టీ తరపున పిటిషనర్ ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించింది. 15 రోజుల్లోగా భవనాన్ని కూల్చివేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. భవనం నిర్మించాక అనుమతులు ఎలా జారీ చేస్తారని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులతో బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది.