Wednesday, 12 March 2025, 1:48
Heart Attack precautions
Heart Attack precautions

Heart Attack precautions: గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తలు

Heart Attack precautions: ఈరోజుల్లో మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల, రోజు మన నడవడిక వల్ల చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బులతో ఒక సంవత్సర కాలంలో కోట్ల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటుంది. అయితే, రోజూవారీ జీవితంలో కొన్ని మార్పులు చేస్తే ఈ గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఎక్స్ పర్ట్స్ అంటూన్నారు. దీనికోసం గుండె ఆరోగ్యాన్ని పెంచే పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం మంచి బ్రేక్ ఫాస్ట్ తో రోజును ప్రారంభించండి:బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరిగే అవకాశం ఉందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. దీనికీ రోజు తప్పకుండా అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ ఇందులో ఓట్స్, నట్స్, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన పండ్లు, ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. ఇవన్నీ మన బాడికి అవసరమైన పోషకాలను అందిస్తాయని వెల్లడిస్తున్నారు.

కనీసం రోజుకు 30 నిమిషాలు ఎక్ససైజ్ చేయాలి: రోజు మిస్ కాకుండా ఎక్ససైజ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఒక వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఎక్ససైజ్ చేయాలని సూచిస్తున్నారు. జిమ్కు వెళ్లకపోయినా వాకింగ్, సైక్లింగ్, ఇంట్లో చిన్నచిన్న ఆసనాలు చేయాలని చెబుతున్నారు. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు చేయాలని, లేదా విడతల వారీగా చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

నిత్యం తీసుకునే ఉప్పు, చక్కెరలను తగ్గించండి: ఉప్పును మనం ఎక్కువగా వాడడం వల్ల అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుందని, దీంతో గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు. చక్కెరను ఎక్కువగా వాడడం వల్ల ఊబకాయం, మధుమేహాం వచ్చే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇవి రెండూ గుండెపై ఒత్తిడి పెంచి జబ్బులకు దారితీస్తాయి తెలిపారు. అందుకే వీటికి బదులుగా తాజా పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.

హైడ్రేట్గా ఉండండి: నిత్యం వాటర్ ను ఎక్కువగా త్రాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి గుండెపై ఒత్తిడి తగ్గుతుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. అలాగని ఏది పడితే అది సోడాలు, కూల్ డ్రింకులు వంటి శీతల పానీయాలు తాగకూడదని సూచిస్తున్నారు. ఇలా కృత్రిమ చక్కెరలు తాగడం వల్ల రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయని చెబుతున్నారు. వీటికి బదులుగా గ్రీన్ టీ, లెమన్ టీ లేదా వాటర్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

స్ట్రెస్ తగ్గించులి కోవా: ఒత్తిడి అనేది గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. దీర్ఘకాలం పాటు ఒత్తిడి (స్ట్రెస్) వల్ల అధిక రక్తపోటు, వాపు పెరిగే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగాసనాలు, ధ్యానం, ఎక్ససైజ్, ప్రాణాయామం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. రోజుకు 10 నిమిషాల పాటు వీటికి కేటాయిస్తే ఒత్తిడి తగ్గి గుండెపై భారం పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందనీ అంటున్నారు.

ఎక్కువ సేపు కూర్చోకుండా కొద్దిసేపు నడవాలి: పని చేసే చోట లేదా ఇంట్లో ఎక్కడైనా సరే గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండెకు ప్రమాదం ఉంటుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గడమే కాకుండా అధిక రక్తపోటు పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ప్రతీ గంట సేపటికి ఒకసారి కొద్దిగా నడవాలని, లేచి అటూ ఇటూ తిరగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సాప్ట్ వేర్, కంప్యూటర్ ముందు, డెస్క్ ఉద్యోగాలు చేసేవారు మధ్యలో రిలాక్స్ తీసుకుంటూ గుండెను కాపాడుకోవాలని సలహా ఇస్తున్నారు.

గమనిక: ఇక్కడ మీకు అందించిన సలహాలు, ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య ఎక్స్ పర్ట్స్ సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని తెలియపరుస్తున్నం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీరు ఒకసారి మీ వ్యక్తిగత డాక్టర్ల సలహాలు తీసుకోవడమే మంచిది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *