Kamareddy: కామారెడ్డి/ బీబీపేట, మార్చి 9 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా ఉదయం నుండి గణపతి హోమం, స్వామివారికి కలశాభిషేకం, అష్టాభిషేకం జరిపి ఉత్సవాలను బ్రహ్మాండంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు చందుపట్ల విట్టల్, ప్రధాన కార్యదర్శి వాసెట్టి నాగేశ్వర్, కోశాధికారి ఎం. పరుశురాములు, గురు స్వామి చంద్రశేఖర్, ఎర్రం ప్రసాద్, ఆది రాజయ్య, భూమా గౌడ్, తేలు సత్యనారాయణ, నందకుమార్ పాల్గొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now