Government Scheme: గుడ్ న్యూస్.. రోజుకు ₹ 7 డిపాజిట్ చేస్తే నెలకి ₹ 5వేల పెన్షన్ పొందే అవకాశం

Government Scheme
Government Scheme

Government Scheme: ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజల కోసం అనేక రకాల పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. మీరు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ పెన్షన్ ప్రయోజనాలను పొందాలని అనుకున్నట్లయితే మీకు అటల్ పెన్షన్ యోజన పథకం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. స్వయంగా ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకంలో మీకు హామీ ఇస్తుంది. ఈ పథకంలో ప్రతిరోజు చిన్న మొత్తంలో డబ్బులను పొదుపు చేసి పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మీరు వెయ్యి రూపాయల నుంచి 5000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ పథకానికి 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు అర్హులు. అలాగే ఈ పథకం ద్వారా పెన్షన్ పొందాలంటే కనీసం మీరు 20 సంవత్సరాలైనా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం.

ఉదాహరణకు మీకు 40 సంవత్సరాలు నుండి ఇప్పటినుంచి మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించినట్లయితే మీకు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ మీరు పెన్షన్ పొందడం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మీ వయసు 18 సంవత్సరాలు అని అనుకుంటే. ప్రతినెలా మీరు ఈ పథకంలో రూ.210 కనిష్టంగా డిపాజిట్ చేయడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత మీకు ప్రతినెల 5000 రూపాయల పెన్షన్ వస్తుంది. నెలకు రూ.210 అంటే రోజుకు నీకు రూ.7 రూపాయలు జమ చేసినట్లు. ఒకవేళ మీకు వెయ్యి రూపాయలు పెన్షన్ కావాలంటే ప్రతి నెల మీరు రూ.42 డిపాజిట్ చేస్తే సరిపోతుంది.

ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన లో భార్యాభర్తలు ఇద్దరు కూడా నెలకు పదివేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ భర్త 60 ఏళ్ల లోపు మరణించినట్లయితే భార్యకు పింఛను లభిస్తుంది. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరూ మరణించినట్లయితే నామినీకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి అందుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అటల్ పెన్షన్ యోజన పథకంలో 7.60 కోట్లకు పైగా ప్రజలు చేరారు. అలాగే ఈ పథకం ద్వారా ప్రభుత్వం హామీ ఇవ్వబడిన పెన్షన్ మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now