Gold Rate Todays: షాక్ ఇస్తున్న పసిడి ధరలు.. ఈరోజు తులంపై ఎంత పెరిగిందంటే..
రాబోయే రోజుల్లో పసిడి 10 గ్రాములకు రూ.55,000 వరకు తగ్గుతాయని నిపుణుల అంచనా. గత కొన్ని ఏళ్ల నుంచి బంగారంలో విపరీతమైన పెరుగుదల కనిపించిన సంగతి తెలిసిందే. 2024 సంవత్సరంలో 30 శాతం కంటే బంగారంపై ఎక్కువ రాబడి వచ్చింది. 2025 సంవత్సరంలో బంగారం దాదాపు 20 శాతం వరకు పెరిగింది. బంగారం మీద పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే గత వారం నుంచి బంగారం ధరలలో తగ్గుదల కనిపిస్తుంది. ఏప్రిల్ 10వ తేదీన మళ్లీ బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపించినప్పటికీ నిన్నటి కంటే ఈరోజుతో పోలిస్తే బంగారం ధరలు భారీగానే పెరిగాయి. తులం బంగారంపై ఏకంగా రూ.700 పైగా పెరిగినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.90,450 దగ్గర కొనసాగుతుంది.
ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు..
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 90,450 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,910 గా ఉంది.
విజయవాడ నగరం, విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 90,450 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 82,910 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,600 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,060 గా ఉంది.
ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,450 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,910 గా ఉన్నట్లు తెలిసింది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,450 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,910 గా నమోదయింది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 90,450 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 82,910 గా ఉంది.
అయితే తాజాగా ఈటీ వార్తల నివేదికల ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాలలో బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు. అమెరికాకు సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం ధరలు రానున్న సంవత్సరాలలో 38% తగ్గుతాయని చెప్తున్నారు. పసిడి ధరలు 38 నుంచి 40% తగ్గినట్లయితే మనదేశంలో 10 గ్రాములకు పసిడి ధర రూ.55,000 కి పడిపోనుందని సమాచారం.