Formers Crop Loans: వెబ్ డెస్క్, ఆగస్టు 19 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పబోతుంది. పంట రుణాలకు కొత్త షరతులను విధిస్తూ రైతులకు భారీ వెసులుబాటు కలగజేయనున్నట్లు తెలుస్తుంది. తక్కువ వడ్డీలకే రుణాలు పొందే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చాలామంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. తక్కువ వడ్డీ రేటుకి ఈ పద్ధతి ద్వారా రుణాలు పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రభుత్వం రైతులకు చెప్పే శుభవార్త ఏంటో తెలుసుకుందాం.
Congress Government Stands by the Farmers:
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలవడానికి తక్కువ వడ్డీకే పంట రుణాలను అందించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం నుండి త్వరలోనే కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా ఉంది. సాధారణంగా బ్యాంకులు తక్కువ వడ్డీకే పంట రుణాలను అందజేస్తాయి. కానీ కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులకు భారీగా వడ్డీలకు రుణాలు అందజేస్తూ వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి దోపిడీని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ సరికొత్త నూతన పథకాన్ని రైతుల కోసం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
Beneficial to the farmers:
ఈ పథకంతో రైతులకు పంట రుణాల కోసం ఎంత వడ్డీ వసూలు చేయాలనే అంశాన్ని ప్రభుత్వమే నిర్ణయించనుంది. ఒక విధంగా ఇది రైతులకు ప్రయోజకరమని చెప్పవచ్చు. గతంలో రూపొందించిన మనీ లెండర్స్ యాక్ట్ ను రేవంత్ రెడ్డి ఇప్పుడు పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు. అధిక వడ్డీలకు వ్యాపారస్తులు ఇష్టారీతిన రుణాలు ఇస్తూ వడ్డీలు వసూలు చేయకుండా రైతులకు ఉపశమనం కలిగేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. త్వరలోనే ఈ అంశానికి సంబంధించిన దస్త్రంపై ప్రభుత్వం ఆమోదముద్ర వేయనన్నట్లు కీలక సమాచారం.
State Government Rules:
జాతీయ, గ్రామీణ బ్యాంకుల తోపాటు సొసైటీలు రైతుల వద్ద వసూలు చేసే వడ్డీ రేటు కన్నా 1.5 శాతం నుండి 2 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేయకుండా ఉండేలా కొత్త నిబంధనలను ఆచరణలోకి తీసుకొచ్చేటట్లు యోచిస్తున్నారు. అంటే రెండు శాతం ఎక్కువ వడ్డీ వ్యాపారస్తులు తీసుకోకూడదన్నమాట. రాష్ట్రంలో చాలామంది రైతులకు ఇలా వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి రుణాలు లభించని వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడం ఇందుకు ఆస్కారంగా ఉంటుంది.
ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయం చాలామంది రైతులకు సానుకూల వాతావరణాన్ని చూపుతుందని చెప్పవచ్చు. చాలా చోట్ల ప్రైవేటు వ్యాపారస్తులు అధిక శాతానికి రైతుల వద్ద వడ్డీలు వసూలు చేస్తూనట్లు సమాచారం. జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్రైవేటు వ్యాపారస్తులు వసూలు చేస్తున్న శాతం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే సమాలోచనలు చేస్తూ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ లెక్కన రైతులకు వడ్డీ రుణాల పట్ల త్వరలోనే ప్రభుత్వం శుభవార్త అందించనుంది.