Current Bill: సమ్మర్లో ప్రతి ఒక్కరు ఇంట్లో కరెంట్ బిల్లు మూత మోగిపోతుంది. అలాంటి ఈ కరెంట్ బిల్లు కంట్రోల్ చేయాలంటే ఈ చిన్న చిట్కాలు ఫాలో అవ్వండిె. ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల పెరుగుతున్న కరెంట్ బిల్లు చూసి భయపడతారు. అయితే ఇకపై వాళ్లకు ఈ భయం అవసరం లేదు. ఈ చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా మీరు మీ కరెంటు బిల్లు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో మీరు మీ కరెంట్ బిల్ పై అధిక భారం పడకుండా ఆదా చేసుకోవచ్చు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనాలు ఎక్కువగా ఏసీ లు, కూలర్లు, ఫ్యాన్లను అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి వినియోగం పెరగడంతో విద్యుత్ బిల్లు ఖర్చు కూడా పెరుగుతుంది.
అధిక విద్యులు రావడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఏసి ఉష్ణోగ్రతను చాలా తక్కువగా ఉంచినా కూడా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సరళమైన మార్గాలను పాటించడం ద్వారా మీరు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని బిల్లు ఆదా చేసుకోవచ్చు. స్మార్ట్ పరికరాలను ఉపయోగించడం వలన విద్యుత్ బిల్లు ఆదా చేయవచ్చు. మీరు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటే మీ ఇంట్లో స్మార్ట్ పరికరాలను ఉపయోగించాలి. స్మార్ట్ ఏసీలను ఉపయోగించాలి.
వీటిలో ఉండే అంతర్ నిర్మిత సెన్సార్లు గది ఉష్ణోగ్రతను గుర్తించి స్వయం చాలకంగా పనిచేస్తాయి. అలాగే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ బల్బులను ఉపయోగించాలి. ఈ బల్బులు అనవసరంగా విద్యుత్ వృధా కాకుండా చేస్తాయి. స్మార్ట్ ఫ్యాన్లు మరియు టీవీలు వాడడం వలన అవి సెన్సార్ ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి విద్యుత్ వినియోగం కూడా తగ్గేలా చేస్తాయి. మీ ఇంట్లో పాత ఫిలమెంట్ బల్బులు ఉన్నట్లయితే వాటిని ఎల్ఈడి బల్బులతో మారిస్తే బెటర్. ఇంట్లో ఉన్న పాత బల్బులు అధిక విద్యుత్తును ఉపయోగించి గదిలో వేడిని పెంచుతాయి. అయితే ఎల్ఈడి బల్బులు 80 శాతం వరకు తక్కువ విద్యుత్ ఉపయోగిస్తాయి. ఇవి ఎక్కువ కాలం పని చేస్తాయి కూడా. దాంతో మీకు అదనపు ఖర్చు ఉండదు.