Eclipse in 2025: రెండవ సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడో తెలుసా!.. సూత కాలం ఎప్పుడు వర్తిస్తుందంటే..!

Eclipse in 2025
Eclipse in 2025

Eclipse in 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈ ప్రభావితం చేస్తాయని నిపుణులు చెప్తుంటారు. అయితే 2025 సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు మరియు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో మొదటి సూర్యగ్రహణం మార్చి 14వ తేదీన అలాగే మొదటి చంద్రగ్రహణం మార్చి 29న ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ మన దేశంలో మాత్రం ఈ రెండు గ్రహణాలు కనిపించలేదు. దాంతో రెండవ సూర్యగ్రహణం మరియు రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో తెలుసుకోవడానికి దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జ్యోతిష శాస్త్రం లెక్కల ప్రకారం ఏడాది రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న సంభవిస్తుందని సమాచారం.

ఈ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి రోజున సంభవించనుంది. మనదేశ కాలమానం ప్రకారం చూసుకుంటే ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 8 రాత్రి 9:57 నుంచి అర్ధరాత్రి 12:23 వరకు ఉంటుందని సమాచారం. అయితే సెప్టెంబర్ 8న ఏర్పడబోయే రెండవ చంద్రగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో సూతక కాలం చెల్లుతుందని చెప్పొచ్చు. కాబట్టి చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా సూతకాల నియమాలను పాటించడం చాలా అవసరం.

అలాగే ఈ ఏడాది ఏర్పడబోయే రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025. ఈ రెండవ సూర్యగ్రహణం ఆశ్వీయుజ మాసం అమావాస్య రోజున సంభవించనుంది. మనదేశంలో ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, రాత్రి 11 గంటల నుంచి సెప్టెంబర్ 22న ఉదయం 3:24 గంటల వరకు ఉంటుందని సమాచారం. సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ రెండవ సూర్యగ్రహణం కూడా మనదేశంలో కనిపించదు. ఈ సందర్భంలో సూతకాలం వర్తించదు అని చెప్పొచ్చు. ఈ ఏడాది ఏర్పడే రెండవ సూర్యగ్రహణం ముఖ్యంగా ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now