Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ తమ కస్టమర్ల కోసం ఇప్పటివరకు అనేక రకాల పథకాలను అమలులోకి తెచ్చింది. సామాన్య ప్రజల కోసం పెట్టుబడి పొదుపు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకాలలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో కూడా సాధ్యం కానీ వడ్డీని వినియోగదారుల కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. అయితే నిపుణులు కూడా సెక్యూరిటీతో కూడిన రిటర్న్స్ రావాలంటే పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా బెస్ట్ అని అంటున్నారు. దేశ ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ లో ఇప్పటికే అనేక పథకాలు అమలులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పథకాలతో మద్దతిస్తుంది. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో వినియోగదారులకు మంచి వడ్డీ రేటు లభిస్తుంది.
ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒకరిని డిపాజిట్ స్కీము చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ పథకంలో రోజుకు కేవలం 50 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షల్లో లాభం తీసుకోవచ్చు. ఈ పథకం కాలవ్యవధి అయిదు సంవత్సరాలు. ఒకవేళ మీరు మరో 5 ఏళ్ళు కూడా పొడిగించుకోవచ్చు. ప్రతినెలా మీరు కనీసం వంద రూపాయలతో రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. గరిష్టంగా ఈ పథకంలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆదాయం ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో 6.7% వడ్డీ లభిస్తుంది.18 ఏళ్ల నిండినవాళ్లు పోస్ట్ ఆఫీస్ లో అవసరమైన పత్రాలను అందించి రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు సంరక్షకుల సమక్షంలో కూడా మైనర్ల పేరుతో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకంలో రోజుకు 50 రూపాయలు అంటే నెలకు 1500 పెట్టుబడి పడితే సంవత్సరానికి పెట్టుబడి 18000 అవుతుంది. ఐదు సంవత్సరాలకు మీరు పెట్టిన పెట్టుబడి 90000 అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న వడ్డీ రేటు ప్రకారం 17500 వడ్డీ వస్తుంది. ఇక మెచ్యూరిటీ నాటికి పెట్టుబడి మరియు వడ్డీ కలుపుకొని 107500 వస్తుంది.