Petrol And Diesel Prices: డీజీలు మరియు పెట్రోలు అసలు ధరలు తక్కువగా ఉంటాయని మీకు తెలుసా. వాటిపై విధించే పనులు మరియు డీలర్ కమిషన్ల కారణంగా అవి సామాన్యులకు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక లీటరుకు వంద రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కు చేరుకున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, డీలర్ కమిషన్ల తర్వాత పెట్రోల్ అసలు ధర ఎంత…వినియోగదారులకు ఎంత ఖరీదు అయినదో మీకు తెలుసా. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పనుల కారణంగా పెట్రోల్ మరియు డీజిల్ రిటైల్ ధరలు పెరుగుతున్నాయి.
అయితే క్లియర్ టాక్స్ నివేదికల ప్రకారం దేశంలో పెట్రోల్ పై పన్ను ధరలో 55% కాగా డీజిల్ పై పన్ను దాని రిటైల్ ధరలో 50% గా ఉంది. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరువేరు రేట్లలో వాట్ విధిస్తాయి. ఇంధన ధరల నిర్మాణం దేశంలో ప్రధానంగా నాలుగు భాగాలుగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు కూడా వీటిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ముడిచుమురు ధరలు మరియు డీలర్ ఫీజులు అలాగే ఎక్సైజ్ సుంకం ఒకే విధంగా ఉంటాయి. వాట్ రేట్లు మాత్రం రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఈ క్రమంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా ప్రతి రాష్ట్రంలో మారుతూ ఉంటాయి. దేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పనులకు ముందు పెట్రోల్ ధర ఒక లీటరుకు కేవలం 55 రూపాయలు ఉండేది. ఒకటి లేదా రెండు రకాల పన్నుల తర్వాత పెట్రోల్ ధర కూడా పెరుగుతుంది. ముడిచుమురు ధర లీటరుకు 40 రూపాయలు. చుమురు మార్కెటింగ్ కంపెనీలు దీనిపై ప్రాసెసింగ్ ఖర్చులను విధిస్తారు. దీని కారణంగా పెట్రోల్ ప్రాథమిక ధర లీటరుకు రూ. 55.66 గా మారింది. ఉదాహరణకు ఈరోజు హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 55.66 ఉంటే డీలర్ కమిషన్ లీడర్ కు 3.77 రూపాయలు అలాగే ఎక్సైజ్ సుంకం మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ కలిపితే ఈ ధర 107.46 రూపాయలకు చేరుకుంది.