Denial of entry into examination centres: మెట్ పల్లి, డిసెంబర్ 15 (ప్రజా శంఖారావం): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుండి ప్రారంభమైన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు సమయపాలన పాటించాలని అధికారులు సూచిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పలుచోట్ల నిమిషం ఆలస్యం అయితేనే 8 మంది అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.
కోరుట్ల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, పిఆర్బిఎం కాలేజ్, అరుణోదయ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లతోపాటు మరికొన్నిచోట్ల పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదని తెలిసింది. అధికారులను అభ్యర్థులు ఎంత ప్రాధేయపడ్డ వినలేదని అభ్యర్థులు వాపోతున్నారు. దీంతో చేసేది లేక అభ్యర్థులు వెనుతిరిగి వెళ్ళిపోయారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now