Daily horoscopes: ఈ రాశుల వారు అదృష్టవంతులు.. శత్రువుల పై విజయంతో పాటు ధన లాభం పొందుతారు.. 12 రాశుల్లో మరి మీ రాశి..
నేటి 17.03.2025 కోసం రాశి ఫలాలను పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ అందించారు. ఈరోజు 12 రాశుల దిన ఫలాలు ఇవే.
మేషరాశి: మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే రహస్య శత్రువుల వల్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆత్మీయులైన వ్యక్తులతో కలిసి చర్చించుకుని పరిస్థితులను అధిగమిస్తారు. ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలోని ముఖ్య వ్యక్తులతో కలిసి వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు.
వృషభ రాశి: తమ పౌరుషమైన మాటల వలన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, చికాకులు రాకుండా కుటుంబ సభ్యులతో అలాగే సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాలతో పాటు తొందరపాటు నిర్ణయాలు డ్రైవింగ్ కు సంబంధించి జాగ్రత్తలు వహించాలి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. వృత్తి విషయంలో అధికారులతో ఆకస్మిక చికాకులు ఏర్పడతాయి.
మిథున రాశి: వీళ్లకు ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యా విషయాలు, సంతానము, ఆకస్మిక నిర్ణయాలు కొంతవరకు ప్రశాంతతను తగ్గిస్తాయి. ఆర్థిక అంశాలపై చర్చలు, కుటుంబ వాతావరణం ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు మౌనం వహించడం మంచిది. రుణ దాతల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వీళ్లు యోగ మెడిటేషన్ వంటివి చేస్తే మంచిది. ఆర్థిక విషయాలు వాయిదా పడతాయి. చికాకును కలిగిస్తాయి.వీళ్లకు సమయానికి నిద్ర, ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం ఉంటుంది. మాట పట్టింపులు లేకుండా బంధువర్గంతో ముందుకు వెళితే మంచిది.
సింహరాశి: ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. తమ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. వృత్తిపరమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం కూడా లభిస్తుంది. శత్రువు రోగ రుణాలు మీద విజయం కూడా సాధిస్తారు. అనుకున్నట్టుగా రుణాలు కూడా వసూలు అవుతాయి.
కన్యా రాశి : వృత్తిపరమైన విషయాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంతవరకు లభిస్తాయి. అయితే వృత్తిపరమైన విషయాలలో మార్గదర్శకులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతత తక్కువగా లభిస్తుంది.
తులారాశి: వీళ్ళు దూర ప్రయాణాలు, ఒత్తిడి మరియు అలసటతో కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలపై, శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితం ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: వీరికి మానసికంగా ఏదో తెలియని నిరాశ ఉంటుంది.మాటల విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులకు ఘర్షణాత్మకమైన వైఖరి అలాగే అన్నదమ్ములతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి.
ధనస్సు రాశి: ప్రారంభంలో ఉద్వేగాలు ఉంటాయి. నూతన వ్యక్తులతో లేదా వ్యాపార భాగస్వాములతో ఆర్థికపరమైన విషయాలలో ఘర్షణాత్మకమైన పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలి. అలాంటప్పుడే మైత్రి బంధాలు బలపడతాయి. తగిన గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ వహించాలి.
మకర రాశి: వీళ్ళు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. సంతృప్తి తక్కువగా లభిస్తుంది. కార్యక్రమాలను శ్రమతో ప్రారంభిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలు కొంతవరకు లాభదాయకంగా అనిపిస్తాయి. శ్రమతో గౌరవాన్ని మరియు ఆదాయాన్ని పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించే అవకాశం ఉంది.
కుంభరాశి: సంతాన అభివృద్ధి కోసం ఖర్చుల అధికంగా అవుతాయి. తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. శ్రమకి తగిన గౌరవం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరింప చేసే ఆలోచనలో ఉంటారు. మీ నెట్వర్క్ ను ఉపయోగించి వృత్తిపరమైన విషయాలలో సోషల్ మీడియాలో కొత్త కమ్యూనికేషన్ విధానాలు రూపొందించుకుంటారు.
మీన రాశి: ప్రశాంతత తక్కువగా లభిస్తుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, తల్లి ఆరోగ్యం, గృహ వాహన అంశాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. పెద్దల సహకారం కూడా అందుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం మీద అలాగే కంటికి సంబంధించిన వాటి మీద శ్రద్ధ అవసరం. కమ్యూనికేషన్ విధానాలు పెరుగుతాయి.